న్యూఢిల్లీ, మార్చి 9 : టీమిండియా పేసర్ మహమ్మద్ షమి గురించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది. ఇటీవల ఆయన భార్య హసీన్ జహాన్.. షమికి ఇతర అమ్మాయిలతో సంబంధాలున్నాయని గత కొద్ది రోజులుగా విడాకులు ఇవ్వాలంటూ తనను ఒత్తిడికి గురిచేస్తున్నాడ౦టూ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలమైన విషయాలను ఆమె వెలుగులోకి తీసుకొచ్చింది. "నన్ను చంపేసి ఏదైనా అడవిలో నా శవాన్ని పాతిపెట్టమని యూపీలో ఉన్న తన సోదరుడికి చెప్పినట్లు హసీన్ తన బాధను వెల్లడించింది. అంతేకాదు భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లిలా షమి.. బాలీవుడ్ నటిని పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడట. నిన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశా. విడాకులు ఎప్పుడు ఇస్తావు అంటూ గత రెండేళ్ల నుంచి నన్ను మానసికంగా, శారీరకంగా షమి బాధపెట్టాడు. నాతో కలిసి షమి ఏ ఫంక్షన్‌కు హాజరయ్యేవాడు కాదు. ఒకవేళ ఎక్కడికైనా కలిసి వెళ్లినా తన భార్యగా నన్ను ఎవ్వరికీ పరిచయం చేసేవాడు కాదంటూ తన ఆవేదనను వెళ్లగక్కింది.