కొలొ౦బొ, డిసెంబర్ 5: వెటరన్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌కు (36) చాలా కాలం విరామం తరువాత ఉరట లభించింది. గతంలో మూడుసార్లు యోయో ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైన యూవీ, ఈసారి విజయవంతమైనట్లు తెలిపారు. యునెసెఫ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ... గత మూడు ఫిట్‌నెస్ పరీక్షల్లోనూ విఫలమవుతూ వచ్చానని, నిన్ననే ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గానని వెల్లడించాడు. తన కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను పూర్తిగా తానే తీసుకుంటానని, వైఫల్యాలు సహజమని అన్నాడు. తాను ఎన్నో ఓటమిలను చూశానని, విజయానికి ఓటమి అనేది పునాదని చెప్పాడు. 2019 ప్రపంచ కప్ వరకు క్రికెట్ అడాలనుకుంటున్నానని, దానికోసం నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.