వరుస ఆఫర్లతో హుషారుగా ఉన్న హాట్ భామ

SMTV Desk 2019-05-03 13:16:05  Niveda Pethuraj

యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజు పేరు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తోంది.ఇటీవల ఈ అమ్మడు చిత్రలహరి హిట్ తో మంచి హుషారుగా ఉంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో నటిస్తోంది. ఇందులో ఈ అందాల భామ హాటుగా కనిపించబోతుందట. ఇదీగాక, మరో ఒకట్రెండు సినిమాల కోసం పేతురాజుని బుక్ చేసుకొన్నారు. తమిళ్ లోనూ ఈ భామకు ఆఫర్లు తలుపుతడుతున్నాయి.

కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అరుణ్‌ విజయ్‌ సరసన నివేదా పెత్తురాజ్‌ నటించనుంది. ఈ మేరకు ఒప్పందం కుదినట్లు చిత్ర బృందం ప్రకటించింది. పేరు ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్‌ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం తెలిపింది...