‘బ్రోచేవారెవరు రా’ టీజర్ చూసారా ?

SMTV Desk 2019-04-20 16:32:39  Brochevarevarura teaser,

శ్రీవిష్ణు, నివేథా థామస్‌, సత్య, నివేథా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రోచేవారెవరు రా’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఆద్యంతం కామెడీతో వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌కు వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ సంగీతం కూడా బావుంది. మొత్తానికి టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు వివేక్ ఆత్రేయ. కాగా ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మెంటల్ మదిలో’ లాంటి హిట్ తరువాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.