నాని అంటే నాకు ప్రత్యేకం

SMTV Desk 2019-04-20 15:24:12  shradha srinath,

కన్నడ యూటర్న్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా జెర్సీ. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రద్దాకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీకు కన్నడ స్టార్ యష్, నేచురల్ స్టార్ నాని లో ఎవరంటే ఇష్టమనే ప్రశ్న ఎదురైంది.

దీనికి శ్రద్దా చెప్పిన సమాధానం ఏంటంటే ? ‘యష్ కంటే నాకు నాని ఇష్టం. నేను ఓ స్టార్‌గా నానితో కలిసి జెర్సీలో నటించాను. నాకు యష్ కంటే నాని అంటే రెస్పెక్ట్. తన స్టార్‌డమ్ కోసం యష్ చాలా కష్టపడ్డాడు. సినిమాల్లోకి రావడానికి ముందు టెలివిజన్‌ తెరపై కనిపించాడు. కన్నడ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశాడు. అయినా నాని అంటే నాకు ప్రత్యేకం’ అంది శ్రద్ధా అన్నారు.