ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత బయోపిక్ తీసేందుకు వేరు వేరు కథానాయికలతో పలువురు దర్శకులు సిద్దం అయ్యారు. పురుచ్చతలైవీ జీవితం ఆధారంగా.. తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్ రూపొందిస్తుంది. ఇందులో నిత్యామీనన్ లీడ్ రోల్ పోషిస్తుంది.ఇక వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తం నిర్మాణంలో.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవీ’ అనే టైటిల్‌తో జయలలిత జీవితాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా, కంగనా రనౌత్ జయలలిత పాత్రను పోషిస్తుంది. మరోవైపు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘శశి లలిత’ పేరుతో జయలలిత బయోపిక్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో జయలలితగా కాజోల్ నటించనుండగా, శశికళగా అమలాపాల్‌ని నటించనున్నట్లు చెబుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో దాదాపు 140కిపైగా చిత్రాల్లో నటించిన జయలలిత 1960 మధ్య కాలంలో టాప్ హీరోయిన్ స్థానంలో నిలిచారు. అనంతరం భారత రాజకీయాలలోను ఆమె ముఖ్యపాత్ర పోషించారు. దాదాపు 14 ఏళ్లకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితమే జయలలిత కన్నూమూశారు.