హర్భజన్‌ సింగ్ సరికొత్త రికార్డు

SMTV Desk 2019-03-25 11:52:05  Harbhajan singh

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ తనలో సత్తా ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్‌-12 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చాటి శభాస్ అనిపించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక కాట్ అండ్‌ బౌల్డ్‌లు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో భజ్జీ.. మొయిన్‌ అలీని రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేశాడు. తాజా వికెట్‌తో 11 కాట్ అండ్‌ బౌల్డ్‌లతో భజ్జీ టాప్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే డ్వేన్‌ బ్రేవో(10)ను భజ్జీ అధిగమించాడు. ఇదిలా ఉంచితే ఆర్సీబీతో మ్యాచ్‌లో తొలి మూడు వికెట్లను హర్భజన్‌ తన ఖాతాలో వేసుకోవడం మరో విశేషం. కోహ్లి(6), మొయిన్‌ అలీ(9), ఏబీ డివిలియర్స్‌(9)లను హర్భజన్‌ పెవిలియన్‌కు పంపించాడు.