మహానాయకుడు ఫ్రీ షోలా.. పిలిచి టికెట్లు ఇస్తున్నారట..!

SMTV Desk 2019-02-27 17:19:42  Mahanayakudu,

క్రిష్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్.టి.ఆర్ బయోపిక్ గా కథానాయకుడు, మహానాయకుడు రెండు పార్టులు రిలీజయ్యాయి. కథానాయకుడు అయినా కాస్త కూస్తో రిలీజ్ ముందు బజ్ క్రియేట్ చేసుకుంది కాని మహానాయకుడికి అది కూడా లేదు. ఈ సినిమా గురించి మాట్లాడిన వారే లేరు. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ సినిమా కనీసం వారం రోజులు కూడా ఆడకపోతే ఎలా అనుకున్నారో ఏమో ఆ సినిమా ఆడించే బాధ్యతను టిడిపి కార్యకర్తల మీద పెట్టారట.

ఇప్పటికే ఏరియా వైజ్ గా జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు సినిమా టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నారట. డ్వాక్రా మహిళలకు ఈ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్సిబిటర్ కు ఎలాగు డబ్బులు వస్తాయి కాబట్టి వారు నో చెప్పట్లేదట. మొత్తానికి మహానాయకుడు లాసుని పార్టీ క్యాడర్ భరిస్తుందని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ లాంటి గొప్ప నటుడు, పొలిటిషియన్ బయోపిక్ కు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.