కౌశల్ పై ఆర్మీ తిరుగుబాటు; బండారం మొత్తం బయటపెట్టేసిన అభిమానులు

SMTV Desk 2019-02-27 13:11:21  Koushal, koushal Army, Bogg Boss 2

హైదరాబాద్, ఫిబ్రవరి 27: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటివరకు వచ్చిన రెండు సీజన్లకు మంచి ప్రేక్షకాధరణ లభించింది. రెండవ సీజన్ లో కౌశల్ మండా విజేతగా నిలిచాడు. దాంతో అతనికి విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది.

నన్ను కావాలనే బిగ్ బాస్ ఇంట్లో మిగతా ఆటగాళ్లు అంతా టార్గెట్ చేస్తున్నారు అంటూ కౌషల్ అశేషమైన ఆధరణను తెలుగు ప్రేక్షకుల నుంచి సంపాదించుకున్నారు. దీంతో రోజు రోజుకీ అతని అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. అభిమానులు అతని కోసం కౌశల్ ఆర్మీ అనే గ్రూప్ ని కూడా తాయారు చేసారు. వీరి అండతోనే కౌశల్ బిగ్ బాస్ టైటిల్ ను గెలిచాడని కూడా చెప్పొచ్చు.

అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కౌశల్ ఆర్మీని స్థాపించిన ఇమామ్ కౌశల్ పై తీవ్ర ఆరోపణలు చేసాడు. కౌశల్ కు విపరీతమైన డబ్బు పిచ్చి అని, అతను ఎక్కడికి వెళ్లినా సరే కౌశల్ ఆర్మీ మాత్రమే అతనికి అయ్యే పూర్తి ఖర్చుల భారం అంతా తమ పైనే వేసేవాడని సంచలన నిజాలు బయటపెట్టారు.

అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో గెలుచుకున్న డబ్బును ఛారిటీకి ఇస్తానని చెప్పిన మాటల్లో కూడా ఎలాంటి వాస్తవము లేదని ఆ డబ్బుని తన సొంత ఖర్చులకి దుర్వినియోగం చేసేసాడని, ఎవరైనా తనకి నెగిటివ్ గా మాట్లాడితే దాన్ని అతని మీద సింపతీ వచ్చేలా మార్చేసుకుంటాడని ఒక న్యూస్ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌషల్ బండారం మొత్తం బయట పెట్టేసారు.