డాన్ గా శర్వానంద్

SMTV Desk 2018-12-20 12:56:03  sarvanand,sudheer varma,padi padi lecha manasu, uv creations

హైదరాబాద్ , డిసెంబర్ 20 : శర్వానంద్ తాజా చిత్రంగా రూపొందిన పడి పడి లేచె మనసు రేపు విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగానే, ఆ తరువాత సినిమాను శర్వానంద్ 50 శాతం వరకూ పూర్తిచేసేశాడు. ఆయన తదుపరి చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమాను గురించి శర్వానంద్ ప్రస్తావించాడు.

" ఈ సినిమాలో నేను డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అందులో ఏ మాత్రం నిజం లేదు. కానీ వొకే పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ మాత్రం ఉంటాయి. నేను గ్యాంగ్ స్టర్ గా కనిపించే ఈ సినిమా ప్రెజెంట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో కొనసాగుతుంది ప్రెజెంట్ ఎపిసోడ్స్ లో వయసు మళ్లిన డాన్ గా కనిపిస్తాను. ఇంకా టైటిల్ ను ఖరారు కానీ ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోంది మరో లాంగ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది" అని ఆయన చెప్పాడు.