హైదరాబాద్, నవంబర్ 16: ప్రముఖ నటుడు హేమసుందర్ తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు . ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సూపర్ స్టార్ రజిని కాంత్ తో తనకు వున్న అనుబంధం గురించి చెప్పాడు . రజనీ హీరోగా ఎదగడానికి ముందు నుంచే నాకు తెలుసు.అతనితో నాకు మంచి అనుబంధం వుంది. అప్పట్లో నాకు స్కూటర్ ఉండేది .. ఆ స్కూటర్ పై నేను వెళుతుంటే నన్ను లిఫ్ట్ అడిగేవాడు. అలాగే నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను అని కూడా అనేవాడు.
అందుకు నేను ఏమి అయినా భుజాల మీద మోసుకెళుతున్నానా .. కూర్చో అనేవాడిని. అలా ఇద్దరం కలిసి వచ్చేవాలం. అలాంటి రజనీకాంత్ నా కళ్లముందే సినిమాలలో వేగంగా దూసుకుపోయాడు. అటువంటి మనిషి తనకి తెలియని అంత ఎత్తుకు ఎదిగిపోయాడు . అయినా గర్వాన్ని మాత్రం దగ్గరికి రానీయలేదు. ఎవరు అయినా ఆప్తులు కనిపిస్తే ఎలా వున్నావురా అని ఆప్యాయంగా పలకరించడం ఆయనకే సొంతం . రజనీకి నిజ జీవితంలో నటించడం రాదు . అందుకే ఇంతమంది మనసులో ఆయనకి గొప్ప స్థానం లభించింది" అని రజిని తో తనకి వున్న అనుబంధాన్ని చెప్పారు .