టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ నాయనమ్మ ఈదర వెంకరత్నమ్మ(87) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అల్లర నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ 2011లో చనిపోయినప్పటి నుంచి వెంకటరత్నమ్మ కోరుమామిడిలో నివసిస్తున్నారు. అనారోగ్యంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ అంత్యక్రియల్లో అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, దర్శకుడు ఇవివి సత్తిబాబు, నిర్మాత కానుమిల్లి అమ్మిరాజు, సరిదే బాలు పాల్గొన్నారు. ఇవివికి ఇద్దరు సోదరులుండగా ఒక సొదరి ఉంది. సినీ ప్రముఖులు, గ్రామస్థులు వెంకటరత్నమ్మ మృతి సంతాపంతో పాటు సానుభూతి ప్రకటించారు.