హైదరాబాద్, ఏప్రిల్ 12 : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన "బాహుబలి: ది కన్‌క్లూజన్" చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు తెచ్చుకొని అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా విదేశాల్లో సైతం ఘన విజయం సాధించింది. అయితే ఈ చిత్రాన్ని జపాన్ లో డిసెంబరు 29న విడుదల చేశారు. అక్కడ మంచి వసూళ్లను రాబట్టి విజయం సాధించింది. ఇప్పటికి 100 రోజులు పూర్తి చేసుకొని అక్కడి బాక్సాఫీసు వద్ద 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత శోభూ యార్లగడ్డ తన ట్విటర్ వేదికగా తెలిపారు. ఇంతటి ప్రేమ, ఆదరణ చూపిన ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే "బాహుబలి"ని చైనాలో కూడా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది.
.@BaahubaliMovie 2 released in Japan on 29th December. It has crossed 100 days in theatres & presently in its 15th week grossing over US$1.3 million! A big thank you to Japanese fans for the love and our Japanese distributor @movietwin2 for a great release! @ssrajamouli
— Shobu Yarlagadda (@Shobu_) April 10, 2018