"రజినీ" రాజకీయాలలోకి వస్తాడా....లేదా....

SMTV Desk 2017-06-30 19:11:26  tamil, actor, rajinikanth, political, entri

చెన్నై, జూన్ 30 : ఇప్పుడు అందరూ రాజకీయలోకి రావడం అనేది తెలిసిన విషయమే అందులోని సినీ నటుల కోసం అయితే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ రాజకీయలలోకి వస్తారా లేదా అని అందరూ సందిగ్ధంలో ఉన్నారు. కానీ రజినీకాంత్ కుటుంబ సభ్యులు ఆయని ఆరోగ్యం పరిస్థితి అంతగా బాలేదని చెప్పి సంకోచంలోకి నెట్టేస్తున్నారు. రజినీకాంత్ ఆయన హాజరయ్యే రాజకీయ పార్టీ సమావేశాలను చూసి అందరూ ఆయన రాజకీయాలలోకి వస్తారని భావిస్తున్నారు. కానీ ఈ సందిగ్ధానికి కారణం ఆయన ఆరోగ్యమని, అంతేకాకుండా ఆయనకు జరిగిన కిడ్నీ ఆపరేషన్ కారణం అని భావిస్తున్నారు. రజినీకాంత్ కూడా ఇదే సందిగ్ధంలో ఉన్నాడని అంటున్నారు. కానీ ఆయన చిన్న కుమార్తె అయిన సౌందర్య మాత్రం"నాన్న మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్న మీకు మేము ఎప్పుడు తోడుగా ఉంటామని" చెప్పింది. ఈయన పేదలకు దేవుడు అందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు అలాంటివి అందుకే ప్రజలు ఆయన రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నారు.