పోయెన్ గార్డెన్ లోని వేద నిలయాన్ని పరిశీలించిన అధికారులు...

SMTV Desk 2017-12-31 11:18:52  poyen garden, collector anbhu selvan, cm palaniswamy.

చెన్నై, డిసెంబర్ 31 : పోయెస్‌ గార్డెన్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు వేద నిలయాన్ని జిల్లా కలెక్టర్‌ అన్బుసెల్వన్‌ బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటన మేరకు స్మారక మందిరంగా మార్చనున్న నేపథ్యంలో జయలలిత అన్న కొడుకు, కుమార్తెలు దీపక్‌, దీపలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీపక్‌ సీఎంకు.. తమ అనుమతి తీసుకోవాల్సిందేనని ఓ లేఖ రాశారు. ఇదిలా ఉండగా అధికారులు వేద నివాసం కొలతలు వేసే పని ప్రారంభించి వేద నిలయాన్ని పరిశీలించారు. అంతేకాకుండా జయ ఇంటిని ప్రభుత్వ పరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు.