పోలీసు అధికారిణి పాత్రలో రాయ్‌లక్ష్మి?

SMTV Desk 2017-12-18 14:17:10  Raylaksmi, new movie, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 18 : ఇటీవల విడుదలైన ‘జూలీ 2’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రాయ్‌లక్ష్మి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అనంతరం, ఆమె తెలుగులో తీసే చిత్రానికి సంతకం చేశారు. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రాయ్‌లక్ష్మి ఇందులో పోలీసు అధికారిణిగా వెండితెరపై సందడి చేయనున్నారట. నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు తెలిపారు. అయితే, ప్రస్తుతం చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ప్రచారంలో ఉంది. ఈ సినిమా కథ అత్యాచారం, హత్య నేపథ్యంలో సాగుతుందట. పోలీసుల దృష్టి కోణంలో స్క్రిప్టును సిద్ధం చేసినట్లు సమాచారం. ‘మార్దాని’ సినిమాలో రాణీ ముఖర్జీ వంటి పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిణి పాత్రలో రాయ్‌లక్ష్మి కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఇందులో నటి అంజలి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.