ఐఎస్‌బీ లీడర్‌షిప్‌ సమ్మిట్‌-2017లో మహారాష్ట్ర సీఎం

SMTV Desk 2017-09-25 18:46:53  ISBE Leadership Summit-2017, Maharashtra Chief Minister Devendra Fadnawis

హైదరాబాద్, సెప్టెంబర్ 25 : హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరుగుతున్న ఐఎస్‌బీ లీడర్‌షిప్‌ సమ్మిట్‌-2017 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని దీనికి దేశంలో ప్రధాని చెస్తున్న సంస్కరణలే కారణమన్నారు. రాష్ట్రంలోని ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నరని వారిని వర్షంపై ఆధారపడి జీవనం సాగించల్సిన పరిస్థితి నుంచి బయట పడేలా చేస్తున్నామని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నీటిని పొదుపుగా వాడుకోవటంలో కొత్త పద్ధతులకు తెలుపుతూ ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాలకు 7 వేల టాంకర్ ల నీటీని ప్రభుత్వం అందించిందని కానీ ఇప్పుడు పొదుపు మంత్రంతో 600 వందల టాంకర్ లను ఉపయోగిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పారిశ్రామిక వ్యవసాయం, రవాణా పట్టుబడులు రాబట్టడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని మంత్రి వెల్లడించారు.