అమీర్‌పేట్‌లో మెట్రో రైల్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా నాగోల్ నుంచి హైటెక్ సీటీ వైపు వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. ఇంతలోనే మెట్రో పిల్లర్ పైనుంచి ఓ ఇనుపరాడ్ కిందపడింది. అయితే, ఆ సమయంలో రోడ్డుపై జనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో మెట్రోలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే మెట్రో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చెరుకొని ప్రయాణికులను కిందకు దించేసి మరమ్మతులు ప్రారంభించారు. ఈ కారణంగా అమీర్‌పేట్-నాగోల్ రూట్‌లో మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది.