రానున్న ఏడేళ్ళలో పెరిగే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇదంతా!!!

SMTV Desk 2017-09-13 11:37:13  GHMC, TRAFFIC PROBLEMS, URBAN IMPROVEMENT PLAN, JUNCTION DEVELOPMENT.

హైదరాబాద్, సెప్టెంబర్ 13 : హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్‌ నిర్వహణ చర్యలను మరింత వేగవంతం చేసే దిశగా జీహెచ్‌ఎంసీ ప్రణాళికలను రూపొందించింది. దీనిలో భాగంగా ప్రధాన జంక్షన్ల వద్ద క్యారేజ్‌ వే విస్తరణ, ఫ్రీ లెఫ్ట్‌ మార్కింగ్‌, సైన్‌ బోర్డుల ఏర్పాటు, పాదచారుల కోసం రెఫ్యూజీ ఐల్యాండ్‌లు, గార్డ్‌ డ్రిల్‌, ఫుట్‌పాత్‌లు, పెలికాన్‌ క్రాసింగ్‌ వంటి సౌకర్యాలను కల్పించనున్నారు. దీనికోసం అర్బన్ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్ పేరిట టాఫ్రిక్‌, రవాణా విభాగాల ఆధ్వర్యంలో మొదటి విడతగా 30 జంక్షన్లను అభివృద్ధి పరిచేందుకు ఒక నివేదికను రూపొందించారు. రానున్న ఏడేళ్ళలో మరింత పెరగనున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ జంక్షన్ల డెవలప్‌మెంట్ కోసం జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోంది.