మొన్న గౌరీ లంకేష్ ....ఇపుడు నేనా ?

SMTV Desk 2017-09-12 17:40:47  Kancha Ilaiah, Book on Arya Vysyas, Gowri Lankesh, Samajika smugglurlu komatollu (Vysyas are social smugglers)

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్రొఫెసర్ కంచ ఐల‌య్య రాసిన పుస్తకంపై ఆర్య‌వైశ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపధ్యంలో ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ... శ్ర‌మ‌శ‌క్తిని దోచుకునే వారిపై తాను పుస్త‌కం రాస్తే దానిని విమ‌ర్శించ‌డం ఏమిటని ప్రశ్నించిన ఆయన కింది కులాల వారు పుస్త‌కం రాసుకోవ‌ద్దా? అంటూ మండిపడ్డారు. తాను గాంధీ, నెహ్రూ, అంబేద్క‌ర్‌లను, చ‌ట్టాన్ని గౌర‌విస్తాన‌ని తెలిపిన ఆయన, పుస్తకం రాసి అభిప్రాయం వెల్లడించే హక్కు తనకు అంబేద్క‌ర్ కల్పించాడని అన్నారు. ఇటీవల గౌరీ లంకేశ్‌ని, ఆమె ఆలోచ‌న‌ల‌ని కాలరాశారని, ఇప్పుడు త‌న‌ని చంపాల‌ని చూస్తున్నారని ఐల‌య్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను దేవుడిని న‌మ్ముతాన‌ని, ద‌ళితులు, బీసీలు, ఆదివాసీలు కొలుచుకునే స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, పోచ‌మ్మ త‌ల్లుల‌ని న‌మ్ముతానని ప్రొఫెసర్ తెలిపారు.