గల్ఫ్ లో తెలుగోడి కష్టాలు..ఊడుతున్న ఉద్యోగాలు..వీసాలూ ఇవ్వట్లేదు..!!

SMTV Desk 2017-09-11 11:27:40  galf countries, gulf indians problems, telugu people, telugu people problems in gulf

హైదరాబాద్ సెప్టెంబర్: 11 ప్రపంచం మొత్తం లో ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో రెండో అతి పెద్ద దేశం భారతదేశం. మరి అలాంటి దేశంలో బతకడానికి ఆవకాశం రాక కొందరు మంచి అవకాశం మరి కొందరు వాటిని తెలుగు వాళ్లు పొట్ట చేతపట్టుకొని పయనమవుతున్న విషయం తెలిసిందే. అయితే అప్పు చేసి మరీ గల్ఫ్ దేశాలకు పయనమయి అక్కడ విదేశీ యాజమాన్యం కోరల్లో చిక్కుకొని అనునిత్యం అనేక రకాల వేధింపులకు గురి అవుతూ బిక్కు బిక్కు మంటూ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే చాలీ చాలని జీతాలతో తన కుటుంబాలను గట్టెక్కిస్తున్న మన తెలుగు వాళ్లకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. స్వదేశీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆరోపిస్తూ.. అక్కడి కంపెనీలన్నీ తెలుగు వారిని ఉద్యోగాల నుండి తీసివేస్తున్నాయి. అంతేకాక వారి వీసాలను కూడా తిరిగి ఇవ్వట్లేదు. దీంతో బుక్కెడు తిండి కోసం తెలుగు వారు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. వీసాల కారణంతో పరదేశాన్ని వీడలేక, స్వదేశానికి రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యల పట్ల స్పందించి చొరవ తీసుకొని వారిని తిరిగి స్వదేశానికి రప్పించడానికి చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. పరాయి దేశాలకు పయనమవుతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.