యూనిఫామ్‌ వేసుకురాలేదని విద్యార్థినిని అవమానించిన ఉపాధ్యాయులు...

SMTV Desk 2017-09-11 10:45:26  sangareddy, ramachandrapuram, ravus public school, telangana

సంగారెడ్డి, సెప్టెంబర్ 11: స్కూల్ లో చదువు నేర్పాల్సిన గురువులు, పిల్లలను అవమానించడం మొదలుపెట్టారు. రామచంద్రాపురం ఓల్డ్‌ఎంఐజీలోని రావూస్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు, ఐదో తరగతి విద్యార్థినిని యూనిఫామ్‌ వేసుకురాలేదని బాలుర మూత్రశాల వద్ద చిన్నారిని నిలబెట్టి అవమానించారు. యూనిఫామ్‌ ఉతకడం వల్లే వేసుకురాలేదని తల్లిదండ్రులు అప్పటికే పాఠశాలకు లేఖ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు నిరసన వ్యక్తం చేస్తూ పాఠశాలలోని ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌లో.." రావూస్‌ పాఠశాలలో జరిగిన ఘటనను పూర్తిగా ఖండిస్తానని, విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. మళ్ళి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకువెళ్తానని" అయన ట్విట్ చేశారు. వెంటనే స్పందించిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి రావూస్‌ పాఠశాలకు స్కూల్ కి నోటిసులు జారీ చేయాలని, అవమానించిన టీచర్ ను సస్పెండ్ చేయాలని, అధికారులకు ఆదేశించారు.