రాజధానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

SMTV Desk 2017-09-10 17:23:13  RSS chief Mohan Bhagwat, Saroor city indoor stadium, All India Attorney Parishad Silver Jubilee

హైదరాబాద్, సెప్టెంబర్ 10 : భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయినా దేశంలోని పరిస్థితులు, సంప్రదాయాలు న్యాయపరమైన చట్టాలుగా రూపొందడం లేదని దేశంలో నైతికతే చట్టబద్ధమైన అంశం ఉనికిలో ఉందని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. నగరంలోని సరూర్ నగర ఇండోర్ స్టేడీయంలో అఖిల భారతీయ అధివక్త పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామ్ మందిర్ నిర్మాణ సమయంలో ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అఖిల భారతీయ ఆధివక్త పరిషత్ ఏర్పడిందన్నారు. పలు దేశాలు తమ క్షేత్రస్థాయి పరిస్థితులు అనుభవాల ఆధారంగా చట్టాలు తయారు చేసుకుంటున్నాయని, ఆ చట్టాలు మనకు ఆదర్శం కాబోవని అన్నారు. సమాజంలో విలువల ఆధారంగా ఆచారవ్యవహారాల్లో మార్పు తీసుకురావడం కోసం న్యాయవాదులు అందరుకుడా కృషి చేయాలని ఈ నేపథ్యంలో ఆయన సూచన చేశారు.