న్యూఢిల్లీ, సెప్టెంబర్ 06 : ఎన్నోఏళ్ల చరిత్రగల ఢిల్లీ రక్షణ శాఖకు సంబంధించిన ఒక్కో చారిత్రక విషయాలను తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలతో పంచుకుంటోంది. అందులో భాగంగా 1944లో ఢిల్లీ పోలీసులు ఉపయోగించిన మొదటి వైర్‌లెస్ చరవాణి చిత్రాన్ని ఢిల్లీ రక్షణ విభాగం పోస్ట్ చేసింది. ఇటీవల ఢిల్లీ పోలీసులు 1861లో రికార్డు చేసిన ఎఫ్ఐఆర్ చిత్రాన్ని కూడా వారు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దేశ యువతతో ఇంటర్నెట్ ద్వారా సంబంధాలను పెంచుకోవడానికే పోలీసు శాఖకు సంబంధించిన చారిత్రక విషయాలను పంచుకుంటున్నట్లు డీసీపీ మాధుర్ వర్మ వెల్లడించారు. వీటితో పాటు ఢిల్లీకి సంబంధించిన కొన్ని ప్రముఖ చారిత్రక ఘట్టాలకు చెందిన ఆధారాలను కూడా ఢిల్లీ రక్షణ విభాగం తమ ట్విట్టర్ అకౌంట్లో ప్రతి గురువారం ప్రజలతో పంచుకుంటున్నట్లు సమాచారం.