రియల్ మీ 3 ప్రో మొబైల్ చూసారా ?

SMTV Desk 2019-04-24 12:05:59  Real me 3 proReal me 3 proReal me 3 pro

ఒప్పో తన సబ్‌ బ్రాండ్‌ రియల్‌మీ సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా రియల్ మీ మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌ మి 3 ప్రో ను ఢిల్లీలో లాంచ్‌ చేసింది. రియల్‌ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను అంచనాలకు అనుగుణంగానే రూ 13,999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. పబ్‌జీ లాంటి గేమింగ్‌, వూక్‌3.0 ఫ్లాష్‌ చార్జ్‌, అద్భుతమైన సోనీ కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా కంపెనీ పేర్కొంది. 29, ఏప్రిల్‌ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి డాట్ కాం ద్వారా అందుబాటులో ఉండనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా వెయ్యిరూపాయల డిస్కౌంట్‌ అందుకోవచ్చు.


ఫీచర్లు: రియల్‌ మి 3 ప్రో ఫీచర్లు
6.30అంగుళాల డిస్‌స్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ పై 9.0
4జీబీ/6జీబీ ర్యామ్‌, 64/128 జీబీస్టోరేజ్‌
25 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ అల్ట్రాహెచ్‌డీ మోడ్‌
16+5 ఎంపీ రియర్‌ కెమెరా
4045 ఎంఏహెచ్‌ బ్యాటరీ