చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మి గో పేరుతో అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.4499 మాత్రమే. 22 మార్చి మధ్యాహ్నం 12 గంట నుంచి ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్టు తెలిపింది. దీని లాంచింగ్ ఆఫర్ విషయానికి వస్తే జియో రీచార్జ్ ద్వారా రూ.2200 క్యాష్‌బ్యాక్, 100 జీబీ ఉచిత డేటా ఆఫర్‌ను అందిస్తోంది.
రెడ్‌మి గో ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
1.4 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
720×1280 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషనన్
ఆండ్రాయిడ్8.1 ఓరియో (గో ఎడిషన్)
1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
8 మెగా పిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ