నగరంలో అక్రమ భవనాల కూల్చివేత...

SMTV Desk 2019-01-11 13:00:10  Hyderabad, GHMC, Ramnagar, Illegal constructed buildings, Break down

హైదరాబాద్/విద్యానగర్, జనవరి 11: నగరంలోని రాంనగర్ చౌరస్తాలో జీఎచ్ఎంసి అధికారులు వొక భవానాన్ని కుప్ప కూల్చివేశారు. ఓ భవనం సెల్లార్ లోని అక్రమ దుకాణాలను జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అదికారులు కూల్చివేశారు. సర్కిల్‌ 15 డిఎంసి ఉమాప్రకాష్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఎసిపి సత్యనారాయణల పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు సాగాయి. అయితే రాంనగర్‌ చౌరస్తా సమిపంలోని పిఎల్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌లో అక్రమంగా షాపులు నిర్మించి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.

వీటిపై ఫిర్యాదులు రావడంతో గతంలో రెండు సార్లు దుకాణాలను కూల్చివేశారు అయితె మళ్ళి షాపులకు మరమ్మతులు చేసి వాణిజ్య అవసరాలకు వినియోగించడంతొ మరల ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గురువారం ఉదయం డిఎంసి ఉమాప్రకాష్‌, ఎసిపి సత్యనారాయణల పర్యవేక్షణలో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది సదరు షాపులను పూర్తిగా నేలమట్టం చేశారు. గోడలు,షాపుల ముందున్న ఇనుపకంచెను తోలగించి సామాగ్రిని తీసి వేయించారు. చైన్‌మెన్‌లు రాజయ్య, అనిల్‌ తో పాటు పలువురు టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది కూల్చివేతల్లో పాల్గోన్నారు.