హైదరాబాద్, డిసెంబర్ 19: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం రోజున ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ ఆమోదించడం జరిగింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యే అయినా సందర్బంగా ఆయన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఛాలెంజ్ చేసి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.
నల్గొండ నుండి పోటీచేసిన రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. అన్న ఓటమిపాలైన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి విజయం సాధించి మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.