ఢిల్లీలో కదం తొక్కిన కార్మికలోకం

SMTV Desk 2018-09-05 13:43:22  AIAWU Ryali, Dhilly, Kishan Magdur Sangarsh Ryali

* కార్మికులకు కనీస వేతన చట్టం అమలుచేయాలి. * ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలంటూ డిమాండ్. న్యూఢిల్లీ :అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్‌ (ఎఐఎడబ్య్లూయూ) ఆధ్వర్యంలో కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ ర్యాలీని బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్‌ స్ట్రీట్‌ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచుతూ.. కనీస వేతనం 600 చేయాలని డిమాండ్‌ చేశారు. ధరల నియంత్రణ, పంటకు గిట్టుబాటు ధర, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాదిగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.