టీచర్స్ డే స్పెషల్

SMTV Desk 2018-09-05 12:35:25  Teachers Day, Sarvepalli radha Krishna

గురు:బ్రహ్మ, గురు:విష్ణు, గురుదేవో మహేశ్వర: గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ: దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే.. ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. ప్రపంచంలో ఎక్కడైనా సరే తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం కేవలం ఒక్క గురువుకి మాత్రమే దక్కుతుంది. అనాధిగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. పురాణాల్లో సైతం విద్యాబుద్దలు నేర్చుకునేందుకు గురువుల వద్ద శిశ్యరికం చేసి ఎంతో పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. ఏటా సెప్టెంబర్ 5ను ‘టీచర్స్ డే’ (ఉపాధ్యాయ దినోత్సవం)గా నిర్వహించుకుంటాం. భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్‌ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌ పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.