ప్రియాంకతో పోటీ పడలేను..

SMTV Desk 2018-06-21 11:52:01  priyanka chopra, nik jonas, australia, delta goodrem.

హైదరాబాద్, జూన్ 21 : బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంకా చోప్రా.. త్వరలో పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రియాంక హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ప్రేమలో మునిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రియాంక, నిక్‌ జోనాస్‌ల ప్రేమ గురించి తెలిసి నిక్‌ మాజీ ప్రేయసి, ప్రముఖ ఆస్ట్రేలియన్‌ గాయని డెల్టా గూడ్రెమ్‌ తెగ బాధపడుతోందట. ఇంతకు విషయమేమిటంటే.. నిక్‌ మాజీ ప్రేయసి డెల్టా గూడ్రెమ్‌.. ఇటీవల నిక్‌ ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అతనితో మాట్లాడి తిరిగి ప్రేమను పొందాలనుకుందట. కానీ ఇందుకు నిక్‌ ఒప్పుకోకపోగా.. అప్పటికే తాను ప్రియాంకతో ప్రేమలో ఉన్నట్లు చెప్పాడట. దీంతో డెల్టా చాలా బాధపడినట్లు హాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ విషయంలో తాను ప్రియాంకతో పోటీపడలేనని నిక్‌ని మర్చిపోవడమే మంచిదని అనుకుందట. కాగా 2017లో లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన మెట్‌ గాలా కార్యక్రమంలో మొదటిసారి ప్రియాంక, నిక్‌ కలుసుకున్నారు. అప్పటి నుండి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారన్న వార్త బలంగా వినిపిస్తోంది. ఈ మధ్య వీరిద్దరి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.