విజయ్ దేవరకొండ ఐడియా భలే ఉంది కదూ..!!

SMTV Desk 2018-05-09 12:21:39  vijay devarakonda, birthday, icecream trucks

హైదరాబాద్, మే 9 : పుట్టిన రోజున మనమేం చేస్తాం. మహా అయితే స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాం. లేదంటే.. విహారయాత్రలకో వెళ్తుంటాం. అదే సేలేబ్రేటీలు అయితే ఘనంగా పార్టీలు ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేస్తారు. లేదంటే అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందాన్న పొందుతారు. కాని హీరో విజయ్ దేవరకొండ ఈసారి కాస్తంత ప్రత్యేకంగా ఆలోచించారు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. గత కొద్దిరోజుల నుండి మండే ఎండలో షూటింగ్ జరుపుకున్నాడు. దీంతో కొత్త ఆలోచనతో తన బర్త్ డే సందర్భంగా మూడు ట్రక్స్‌ని హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకు పంపించాడు. ఇంతకి ఆ ట్రక్స్ లో ఏముందని ఆలోచిస్తున్నారా.!! ఐస్‌క్రీమ్ ట్రక్స్. విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో.. "ఎండలో కొద్ది రోజుల పాటు షూటింగ్ చేసే సరికి నాకు ఈ ఐడియా వచ్చింది. మూడు ఐస్‌క్రీమ్ ట్రక్స్‌ని సిటీ మొత్తం తిరగుతూ వారి పని మీద రోజంతా ఎండలో ఉండే ప్రతి ఒక్కరికీ ఐస్‌క్రీమ్ ఇవ్వమని చెప్పాను. ట్రాఫిక్ పోలీసులకు, రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులకు, స్టూడెంట్స్, ఉద్యోగులకు అందరికీ ఇవ్వమని చెప్పాను" అని విజయ్ దేవరకొండ ట్విటర్ ద్వారా తెలిపాడు. ఐడియా భలే ఉంది కదా..