చెన్నై, జనవరి 1 : నూతన సంవత్సర వేళ ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వినోద్‌రాజ్ (80) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం స్థానిక మహాలింగపురంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో విక్రమ్ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వినోద్‌రాజ్ నటుడుగా పలు కన్నడ, తమిళ చిత్రాలలోనూ, బుల్లితెర సీరియళ్లలోనూ నటించారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.