జిమ్ లో చెమటోడుస్తున్న శ్రీదేవి కూతురు జాన్వి...

SMTV Desk 2017-12-18 19:15:45  sridevi, janvi, boni kapoor, ishan.

ముంబాయి, డిసెంబర్ 18: అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి జిమ్ లో తెగ ఎక్సేర్ సైజులు చేసి చెమటోడుస్తుంది. జాన్వి హీరొయిన్ గా ‘ధడక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ కజిన్ ఇషాన్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే జాన్వి కి ఇటు ట్విట్టర్ లో, అటు చిత్రపరిశ్రమలో అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. జాన్వీ కూడా తన శరీరాకృతిని కాపాడుకోవడానికి జిమ్ లో శ్రమిస్తుంది. ట్రైనర్ సహాయంతో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది.