మోదీ నీచుడ౦టూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సస్పెండ్

SMTV Desk 2017-12-08 12:37:55  manishankar ayyar, modi, comments, contrevorsy, congres

న్యూఢిల్లీ, డిసెంబర్ 08: కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోదీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గతంలో కూడా అనేక విమర్శలు చేసిన ఆయన తాజాగా మోదీ నీచుడూ, సభ్యత లేని మనిషి అ౦టూ ఘాటుగా విమర్శించారు. గుజరాత్ ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ ఆగ్రహించింది. అయ్యర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, ఆయన ప్రాధమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై మోదీ కూడా తీవ్రంగానే స్పందించారు. ఓ కాంగ్రెస్ నేత తనను నీచుడు, నీచమైన కులస్తుడు అంటూ యావత్ గుజరాత్ నే అవమానించారు. ఇది కాంగ్రెస్ అహంకార రాజకీయాలకు నిదర్శనం అని మోదీ అన్నారు. సామాన్య ప్రజలు మంచి దుస్తులు వేసుకున్నా, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందిన కాంగ్రెస్ ఓర్చుకోలేదని, ద్వేషించే మొగలాయి మనస్తత్వానికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. దేశమే తమ తొలి ప్రాధాన్యమని మోదీ పునరుద్ఘాటించారు.