బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా సిద్దిపేట!

SMTV Desk 2017-11-19 14:12:34  open defecation free district, siddipeta, odf

సిద్దిపేట, నవంబర్ 19:తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా (ఓడీఎఫ్)గా సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట జిల్లాలో 26 రోజుల్లో 26,294 మరుగుదొడ్లను నిర్మించి, వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో ప్రథమంగా ఓడీఎఫ్ సాధించిన నియోజకవర్గంగా సిద్దిపేట నిలిచింది. నేడు (నవంబర్ 19న) అంతర్జాతీయ మరుగుదొడ్ల దినం సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి సిద్దిపేటను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించనున్నారు. మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి చొరవతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. 2015 అక్టోబర్ 2న సిద్దిపేటను ఓడీఎఫ్ నియోజకవర్గంగా ప్రకటించిన విషయం తెలిసిందే.