అజిత్.... టిజర్ రికార్డు

SMTV Desk 2017-09-15 14:13:32  ajith, ajith kumar, vivekam, kajal agarwal, director shiva, vivekam movie teaser

హైదరాబాద్, సెప్టెంబర్ 15: విలక్షణ నటుడు అజిత్‌ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వివేగం’ చిత్రం మంచి హిట్ అందుకొని తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ‘వివేకం’ పేరిట ఆగస్టులో విడుదలైంది. ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటించగా, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్‌ విడుదలైనప్పుడే అజిత్‌ అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ లాగే సినిమా అదరగోట్టేయడంతో బాక్సఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతుందని అంచనా వేస్తున్నారు . తాజాగా ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక లైకులు వచ్చిన టీజర్‌గా ‘వివేకం’ రికార్డు సృష్టించింది. ఐదు లక్షలకుపైగా ఈ టీజర్‌ లైకులు సంపాదించుకుని, హాలీవుడ్‌ ‘స్టార్‌వార్స్‌’ చిత్రాన్ని బీట్‌ చేసినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.