ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు...పోతే లక్ష రూపాయలు!!!

SMTV Desk 2019-12-23 18:01:47  

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త క్రెడిట్ కార్డు తీసుకువచ్చింది. ఎస్‌బీఐ ఈ కొత్త క్రెడిట్ కార్డు కోసం విమానయాన సంస్థ విస్తారా‌తో జతకట్టింది. ఇరు సంస్థలు సంయుక్తంగా ఈ కార్డును లాంచ్ చేశాయి. దీని పేరు క్లబ్ విస్తారా ఎస్‌బీఐ కార్డు. విస్తారా సీఈవో లెస్లీ థంగ్, ఎస్‌బీఐ కార్డు సీఈవో, ఎండీ హర్దయాల్ ప్రసాద్ ఇటీవల ఈ కార్డను మార్కెట్‌లోకి విడుదల చేశారు. క్లబ్ విస్తారా ఎస్‌బీఐ కార్డు రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. క్లబ్ విస్తారా సిల్వర్, బేస్ టైర్ మెంబర్‌షిప్, విస్తారా ఫ్లైట్ వెల్‌కమ్ టికెట్స్, వన్ క్లాస్ అప్‌గ్రేడ్ వోచర్, ఫ్రీ క్యాన్సలేషన్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే ఎక్స్‌ట్రా ఫ్లైయర్ పాయింట్స్, లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రూ.72,000 వరకు చెకిన్ బ్యాగేజ్ లాస్ కవరేజ్, రూ.7,500 చెకిన్ బ్యాగేజ్ డిలే కవరేజ్, రూ.12,500 వరకు ట్రావెల్ డాక్యుమెంట్స్ లాస్ కవరేజ్, రూ.1 లక్ష వరకు కార్డ్ లాస్ట్ కవరేజ్, ఏడాదిలో ఆరు సార్లు విమాన టికెట్ల ఫ్రీ క్యాన్సలేషన్, రూ.కోటి వరకు ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కార్డు రివార్డ్ పాయింట్ల విషయానికి వస్తే.. కార్డు పొందిన తొలి 90 రోజుల్లో రూ.75,000 ఖర్చు చేస్తే 3,000 బోనస్ సీవీ పయింట్లు వస్తాయి. వార్షికంగా రూ.1.5 లక్షలు, రూ.3, లక్షలు, రూ.4.5 లక్షలు, రూ.8 లక్షలు కార్డు ద్వారా ఖర్చు చేస్తే ప్రతిసారి 1 ప్రీమియం ఎకానమీ టికెట్ పొందొచ్చు. రూ.8 లక్షలు ఖర్చు చేస్తే రూ.10,000 యాత్ర హోటల్ ఈ వోచర్ లభిస్తుంది. ఎస్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డు ఫీజు విషయానికి వస్తే.. కార్డు జాయినింగ్ ఫీజు రూ.2,999గా ఉంది. దీని ఇతర పన్నులు అదనం. అలాగే ప్రతి ఏడాది రూ.2,999 ఫీజు చెల్లిస్తూ రావాలి. దీనికి కూడా ట్యాక్స్‌లు అదనం. యాడ్ ఆన్ కార్డు ఉచితంగా పొందొచ్చు. కార్డుతోపాటు వెల్‌కమ్ గిఫ్ట్ కింద ఒక విమాన టికెట్ ఉచితంగా వస్తుంది.