వాట్సాప్ లో డార్క్ మోడ్ ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?

SMTV Desk 2019-12-19 13:52:58  

వాట్సాప్ ఎన్నో ఇతర ఫీచర్లను అందిస్తుంది కానీ డార్క్ మోడ్ ను మాత్రం ఇప్పటి వరకు తీసుకురాలేదు. వస్తుంది, వస్తుంది అని అందరూ అంటున్నప్పటికీ.. బీటా యూజర్లలోనే చాలా మందికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. డార్క్ మోడ్ అనేది మన కళ్ల మీద పడే ప్రభావాన్ని తగ్గిస్తుంది కాబట్టి ప్రజలు ఎక్కువగా సమయం గడిపే వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్స్ ఈ డార్క్ మోడ్ ను తీసుకురావాలని వినియోగదారులకు కోరుకుంటున్నారు. వాట్సాప్ డార్క్ మోడ్ ను అధికారికంగా అందించనప్పటికీ మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ డార్క్ మోడ్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. మీది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే మీరు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంకు అప్ గ్రేడ్ అయి ఉండాలి.

***ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే ఈ కింద పేర్కొన్న ప్రక్రియను అనుసరించండి.:

❂ మీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తున్నట్లయితే.. డెవలపర్ ఆప్షన్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందులోకి వెళ్లాలంటే..

❂ ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ ను ఓపెన్ చేయండి.

❂ అందులో About Phoneలోకి వెళ్లండి.

❂ అక్కడ కనిపించే Build Numberపై ఏడు సార్లు ట్యాప్ చేయండి. అప్పుడు కింద మీకు You are now a developer అని కనిపిస్తుంది. ఒకవేళ ఏడుసార్లు ట్యాప్ చేసినప్పుడు కనిపించకపోతే.. అది కనిపించే వరకు ట్యాప్ చేస్తూనే ఉండండి.

❂ ఇప్పుడు సెట్టింగ్స్ లో డెవలపర్స్ ఆప్షన్స్ లోకి వెళ్లి అక్కడ Override force darkపై క్లిక్ చేసి దాన్ని ఆన్ చేయండి.

❂ ఇప్పుడు వాట్సాప్ ను తిరిగి ఆన్ చేయండి. మీ ఫోన్ లో వాట్సాప్ డార్క్ మోడ్ యాక్టివేట్ అయి ఉంటుంది.

❂ ఒకవేళ మీరు కలర్ ఓఎస్ వంటి సిస్టం వైడ్ డార్క్ మోడ్ ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నట్లయితే.. మీరు మీ ఫోన్ సెట్టింగ్స్ లో ఉన్న డార్క్ మోడ్ సెట్టింగ్స్ లోకి వెళ్లి System-wide dark mode ఆప్షన్ ను ఎంచుకుంటే సరిపోతుంది.

***ఐఫోన్ అయితే ఇలా చేయండి..:

❂ ఐవోఎస్ లో ఫోర్స్ డార్క్ మోడ్ లేదు కానీ, దాదాపు అలాంటి ఫీచరే అందుబాటులో ఉంది.

❂ దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఐఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.

❂ అందులో Accessibilityపై క్లిక్ చేయండి.

❂ యాక్సెసబిలిటీలో Display , Text sizeపై క్లిక్ చేయండి.

❂ అందులో ఉన్న Smart Invert ఫీచర్ ను యాక్టివేట్ చేసుకుంటే చాలు. మీ వాట్సాప్ లో డార్క్ మోడ్ యాక్టివేట్ అయినట్లే..