బలపరీక్షలో విజయం...అనుకూలంగా 169 మంది ఎమ్మెల్యేలు

SMTV Desk 2019-11-30 16:46:40  

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే బలపరీక్షలో విజయం సాధించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్‌ దిలీప్‌ శనివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. . ఆయనకు అనుకూలంగా 169 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మహారాష్ట్రలో కొత్తగా నియమితులైన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వం విశ్వసనీయ ఓటును ఎదుర్కొంటుంది. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన ఆశ్చర్యకరమైన ప్రమాణంతో మరియు 80 గంటల తర్వాత ఆయన రాజీనామాతో పరిణామాలు వేగంగా మారాయి.. ఫ్లోర్ టెస్ట్‌కు సుప్రీం గడువు విధించడంతో.. సరైన మెజార్టీ లేక దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అనంతరం.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ జట్టు కట్టి ఉద్దవ్‌ను సీఎంను చేశాయి.. దీంతో ఇవాళ అసెంబ్లీలో ఉద్దవ్ విశ్వాసపరీక్ష నెగ్గారు. అయితే ప్రతిప‌క్ష బీజేపీ.. విశ్వాసపరీక్షకు ముందు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. రాజ్యాంగ వ్యతిరేకంగా స‌భ నిర్వహిస్తున్నార‌ని ఆరోపించారు మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్. ఇక, బీజేపీ సభ్యులు లేకుండానే విశ్వాసపరీక్ష జరిగింది.