నెలసరి రెగ్యులర్‌గా రావాలంటే!

SMTV Desk 2019-11-16 14:11:57  

కొనమంది మహిళలకు నెలసరి సరిగ్గా రావు. దీంతో భవిష్యత్‌లో ఇబ్బందులు ఏర్పడతాయి. అలా కాకుండా రెగ్యులర్‌గా పీరియడ్స్ రావాలంటే కొన్ని ఇంటి చిట్కాలను వాడొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

*అల్లం:

అల్లం అనేది గొప్ప ఔషధం అని చెప్పొచ్చు. వంటల్లో అధికంగా వాడే ఈ ఆహార పదార్థం ఆరోగ్యం విషయంలోనూ ఎంతగానో సాయపడుతుంది. దీనిలోని గొప్ప గుణాలు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారంగా మారతాయి. అందుకే దీనిని చాలా రకాలైన ఔషధాల తయారీల్లోనూ వాడతారు. ఇప్పుడు దీన్ని ఉపయోగించి పీరియడ్స్‌ని రెగ్యులర్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. ఓ కప్పు నీటిలో తాజా అల్లం ముక్కని వేసి బాగా మరిగించండి. ఐదు నిమిషాల తర్వాత దీనిని వడకట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కాసింత తేనెని కలపండి. దీనిని ప్రతీ రోజూ భోనం చేసిన తర్వాత తాగండి. దీని వల్ల చక్కని ఫలితాలు ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్‌‌గా తయారవుతాయి.

*సోంపు:

సోంపు కూడా ఈ సమస్యకి పరిష్కారం చూపుతుంది. రుతుసమస్యలను సరిచేసే గుణం దీనికి ఉంటుంది. సోంపు, సోంపు గింజల ఆకులు కూడా పీరియడ్స్ ఇరెగ్యులర్ ప్రాబ్లమ్‌‌ని కంట్రోల్ చేస్తుంది. ఈ గింజలను బహిష్టు సమయంలో వాడడం వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఈ గింజలను వాడి పీరియడ్స్‌ని ఎలా రెగ్యులర్ చేసుకోవాలో చూద్దాం.. ఇందుకోసం ముందుగా రెండు టీస్పూన్ సోంపుని తీసుకుని రాత్రంతా నానెబట్టండి. ఇప్పుడు ఉదయాన్ని ఆ నీటిని వాడబోసి తాగండి. మీకు పీరియడ్స్ రెగ్యులర్‌గా అయ్యేవరకూ వీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల త్వరగానే సమస్య పరిస్కారం అవుతుంది.

*దాల్చిన చెక్క:

మసాలా దినుసుల్లో ఒక్కటైన దాల్చిన చెక్కలోనూ ఎన్నో చక్కని గుణాలు ఉంటాయి. వీటిని ఉపయోగించి సమస్యను తగ్గించుకోవచ్చు. హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలోనూ ఈ మసాలా దినుసు చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి రుతు క్రమ సమస్యలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. ఇందుకోసం దాల్చిన చెక్కని చక్కగా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని గోరువెచ్చని పాల్లలో కలిపి తాగాలి. అదే విధంగా.. మీరు తీసుకునే ప్రతీ ఆహారంపైనా ఈ పొడిని చల్లుకుని తీసుకోవచ్చు. దీని వల్ల పీరియడ్స్ కచ్చితంగా రెగ్యులర్ అవుతాయి.

*పండ్లు, కూరగాయల జ్యూస్‌లు:

హార్మోన్స్ మార్పుల వల్ల శరీరంపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ కారణంగానే పీరియడ్స్ తప్పడం, ఆగిపోవడం జరుగుతుంటుంది. అయితే అన్ని రకాలైన పోషకాలు, మినరల్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అందుకోసం రకరకాల పండ్లు, కూరగాయలను మీ డైట్‌లో చేర్చుకోండి. అదే విధంగా క్యారెట్, ద్రాక్ష వంటి వాటిని జ్యూస్ చేయడం వల్ల కచ్చితంగా రుతుక్రమ సమస్యలన్నీ దూరం అవుతాయి.

*ఆపిల్ సిడర్ వెనిగర్..:

పీరియడ్స్‌ని రెగ్యులర్ చేయడంలో ఆపిల్ సిడర్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ సరిగ్గా ఉంటాయి. దీనిని ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం ఎలా వాడాలో చూద్దాం.. గ్లాస్ వాటర్‌లో రెండు స్పూన్స్ ఆపిల్ సిడర్ వెనిగర్‌ని బాగా కలపండి. ఇది భోజనానికి ముందు తాగండి. ఓ పది నిమిషాల తర్వాత భోజనం చేయండి. దీని వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.

*యోగా, మెడిటేషన్:

బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా కూడా చాలా వరకూ మహిళలలో ఒత్తిడి ఎదురవుతుంది. ఈ కారణంగా రుతుక్రమ సమస్యలు వస్తాయి. ఇందుకోసం ప్రతీ రోజూ ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. దీని వల్ల సమస్య తగ్గుతుంది.