రూ.7,000 జీతంతో... బైక్/స్కూటర్ లోన్!

SMTV Desk 2019-11-12 14:35:22  

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు టూవీలర్ లోన్స్ అందిస్తోంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టూవీలర్ లోన్ తీసుకోవాలంటే ఉద్యోగం చేయాలి. స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా రుణానికి అర్హులే. వయసు 21 నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఉద్యోగం చేసే వారు సంవత్సరానికి రూ.84,000 స్థూల ఆదాయం కలిగి ఉండాలి. అంటే నెలకు రూ.7,000 వేతనం ఉన్నా సరిపోతుంది. అదే స్వయం ఉపాధి పొందుతున్న వారి వార్షిక స్థూల ఆదాయం రూ.72,000 ఉండాలి.టూవీలర్ మొత్తానికి సమానమైన మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. అంటే 100 శాతం ఫైనాన్స్ సౌకర్యం ఉంది. అయితే ఇది ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. లోన్ ప్రాసెసింగ్ ఫీజు 3 శాతం. డాక్యుమెంటేషన్ చార్జీలు కూడా 2 శాతంగా ఉంటాయి. ప్రిపేమెంట్ చార్జీలు కూడా ఉంటాయి. లోన్‌పై వడ్డీ రేటు 10.4 శాతం నుంచి ప్రారంభమౌతుంది.లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. లేటెస్ట్ శాలరీ స్లిప్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) వంటి డాక్యుమెంట్లు కూడా కావాలి. తీసుకున్న రుణాన్ని 12 నెలల నుంచి 48 నెలల లోపు తిరిగి చెల్లించాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా లభిస్తుంది.ఈ లింక్‌పై https://leads.hdfcbank.com/applications/new_webforms/apply/mobile/Two-wheeler-Loan.aspx?SourceCode=HMET క్లిక్ చేసి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.