పంత్ ను పక్కన పెట్టడమే మంచిది!

SMTV Desk 2019-10-02 15:24:39  

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత జట్టు యువ క్రికెటర్ రిషబ్ పంత్ ను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తుంది. సాహానే అద్భుతమైన కీపర్‌,యువబ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను పక్కనపెట్టడం సరిఅయినదే కోహ్లీ నిర్ణయం మంచిదేనని ట్విటర్‌లో అభిమానులు తమ అభిప్రాయాలని తెలిపారు. ఆటను మెరుగుపర్చుకోవాలని కొందరు ఈ యువ ఆటగాడు రిషప్ పంత్ కి సూచిస్తుండగా, సీనియర్‌కీపర్‌ వృద్ధిమాన్‌సాహాను రిషభ్‌పంత్‌ బదులు జట్టులోకి తీసుకున్నామని కోహ్లీ చెప్పారు.సాహా ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్‌ అని మన సారథి విరాట్ కోహ్లీ పొగిడారు. ఇంగ్లాండ్‌, ఆసీస్‌ పర్యటనల్లో యువకీపర్‌ పంత్‌ బానే రాణించాడు. కాని ఈ మద్యకాలంలో విండీస్‌ పర్యటనలోనూ పంత్‌ సరిగా రాణించకపోవడంతో చాలా విమర్శలు ఎదుర్కుంటున్నాడు.