వెయిట్ లాస్ టిప్స్..... ఈ ఆరు చిట్కాలు పాటిస్తే చాలు

SMTV Desk 2019-05-07 16:11:38  weight loss, weight loss tips, slim look, workouts

ఉరుకులు, పరుగులు జీవితం.. టైంకు భోజనం ఉండదు.. నిద్ర కరువు.. ఫలితంగా అధిక బరువు. ఇక రోజూ వ్యాయామం, యోగా చేసేందుకు సమయం దొరకడం లేదా.. టెన్షనొద్దు.. చిన్న, చిన్న చిట్కాలతో ఎంచక్కా బరువు తగ్గేయొచ్చు. రోజువారీ సరదాగా.. ఈ చిట్కాలను పాటిస్తే చాలు బరువు ఇట్టే తగ్గేయొచ్చట. ఈ అలవాట్లతో కొద్ది రోజుల్లోనే ఆ ఆరు చిట్కాలేంటో మీరూ తెలుసుకోండి.

రోజువారీ మనం ఇంట్లో నుంచి బయటకు వెళుతుంటాం.. షాపింగ్ మాల్స్, ఆఫీస్‌లు ఇలా చాలాచోట్లకు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లిన చోట లిఫ్ట్‌లు, ఎలివేటర్లు బదులు మెట్లు ఉపయోగిస్తే చాలా మంచిదట.. దీన్ని ఓ అలవాటుగా చేసుకోవాలి. ముందు ఓ నెల ట్రై చేసి చూడండడి.. తర్వాత మీకు తప్పకుండా నచ్చుతుంది. ఐదు నిమిషాల పాటూ ఇలా మెట్లు ఎక్కడం వలన దాదాపు 144 కేలరీలు ఖర్చవుతాయట.

ఎక్కువమంది ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా.. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ముందు కుస్తీలు పడుతుంటారు. రోజూ గంటల తరబడి కుర్చీల్లో కూలబడే ఉద్యోగాలు మరి. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే.. బరువు పెరిగిపోతారు. కనీసం గంటకు ఓసారైనా కనీసం 15 నిమిషాలైనా లేచి నిలబడండి.. కుదిరితే ఓ పది అడుగులు వేస్తే మంచిది. ఇలా చేయడం ద్వారా 36 కేలరీలు ఖర్చవుతాయట

మన ఇంటిని.. మనం పరిశుభ్రం చేసుకోవడం ద్వారా.. ఇల్లు శుభ్రమవుతుంది.. అధిక బరువు తగ్గుతుంది. ఇలా ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేయడం ద్వారా ఒంట్లో కేలరీలను ఖర్చు చేయొచ్చు. చూయింగమ్స్ అలవాటు కూడా మంచిదేనట.. కాకపోతే షుగర్ లెస్. తాజా సర్వేలో చూయింగమ్స్ వల్ల కూడా బరువు తగ్గుతారని తేలింది. ఇలా చూయింగమ్స్ నమలడం ద్వారా.. దవడ కండరాలు కదిలి.. గంటకు 11 కేలరీలు ఖర్చు అవుతుందట.

ప్రతి రోజూ కారు, బైక్ వాష్ చేయడం మంచి అలవాటట. మన కారు శుభ్రంగా ఉంటుంది.. మన ఒంట్లో కూడా కరుగుతుందట. మనకు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇలా కారు, బైక్‌ శుభ్రం చేయడం ద్వారా గంటకు 280 కేలరీలు ఖర్చవుతాయట. ఇంట్లో పిలల్లు సరదాగా తమతో కలిసి ఆడాలని పెద్దవాళ్లను అడుగుతుంటారు. ఇండోర్ గేమ్స్ కాదండోయ.. అవుట్ డోర్ ఆటలు. సరదాగా పిల్లల్ని బయటకు తీసుకెళ్లి అటూ ఇటూ పరిగెత్తండి.. ఆటలాడండి. ఇలా చేయడం ద్వారా గంటకు 80-137 కేలరీలు కరుగుతాయట. ఇలా రోజువారీ చేస్తే బరువు తగ్గుతారట.