ఎయిర్‌టెల్ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కేవలం స్మార్ట్ ఫోన్లల్లో వచ్చే ఎయిర్‌టెల్ టీవీని ఇప్పుడు వెబ్ వెర్షన్‌లోనూ అందిస్తున్నారు. అందుకు గాను ఎయిర్‌టెల్ కస్టమర్లు https://www.airtelxstream.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అనంతరం అందులో తమ ఎయిర్‌టెల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై అవ్వాలి. దీంతో ఎయిర్‌టెల్ టీవీ సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ టీవీ వెబ్‌వెర్షన్‌లో పరిమిత సంఖ్యలో మాత్రమే వీడియోలు, ఇతర లైవ్ టీవీ సేవలను అందుబాటులో ఉంచారు. త్వరలో పూర్తి స్థాయిలో అన్ని వీడియో సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు, లైవ్ టీవీ సేవలను అందివ్వనున్నారు.