సీట్ ఇవ్వనందుకు కాంగ్రెస్ లో చేరిన బిజెపి ఎంపి

SMTV Desk 2019-04-24 15:39:18  congress party, bjp, loksabha elections, bjp mp, udith raj

న్యూఢిల్లీ: బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలోకి వాయువ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపి ఉదిత్ రాజ్ చేరారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అతనికి సీట్ కేటాయించకపోవడంతో ఆగ్రహానికి గురై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వాయువ్య ఢిల్లీ లోక్ సభ స్థానాన్ని పంజాబీ గాయకుడు హన్స్‌రాజ్‌కు బిజెపి కేటాయించింది. దీంతో ఉదిత్ రాజ్ బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. బుధవారం ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ప్రతిభ కనబర్చిన ఎంపిల్లో తాను రెండో స్థానంలో ఉన్నానని ఉదిత్ రాజ్ తెలిపారు. తన ట్విటర్ ఖాతాలో చౌకీదార్ పేరును కూడా ఉదిత్ రాజ్ తొలగించారు. ఉదిత్ రాజ్ ఒకప్పుడు ఐఆర్‌ఎస్ అధికారిగా పని చేశారు. 2012లో ఆయన ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2014లో ఆ పార్టీని బిజెపిలో విలీనం చేశారు. అదే ఏడాది వాయువ్య ఢిల్లీ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఉదిత్ రాజ్ రాజీనామాతో వాయువ్య ఢిల్లీ స్థానంలో బిజెపికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.