విష్ణు హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్ లో సినిమా

SMTV Desk 2019-04-04 18:19:41  Manchu vishnu, Srinu vaitla

మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఢీ. మంచు హీరోకి మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించింది. ఆ సినిమా తర్వాత వరుస స్టార్స్ తో ఛాన్స్ వచ్చినా పెద్దగా ప్రభావితం చూపించలేదు శ్రీను వైట్ల. ప్రసుతం కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న ఈ దర్శకుడు మళ్లీ ఢీ కాంబోలో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందట.

ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని వెళ్లడించాడు మంచు విష్ణు. ఢీ తర్వాత 12 ఏళ్ల తర్వాత కలిసి మళ్లీ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఢీకి సీక్వల్ గా ఉంటుందా లేక కొత్త కథా అన్నది తెలియాల్సి ఉంది. మంచు విష్ణు లేటెస్ట్ గా ఓటర్ సినిమా చేశాడు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవగా మంచి స్పందన వచ్చింది. అయితే ఓటర్ రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరి శ్రీను వైట్లతో చేసే సినిమాతో అయినా మంచు విష్ణు హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.