ప్రపంచ కుబేరులు ఇద్దరే

SMTV Desk 2019-03-21 12:45:14  Jeff Bezos, Amazon founder Jeff Bezos, Bill Gates. Amazon CEO, Microsoft founder

మార్చ్ 20: వంద బిల్లియన్ డాలర్ల కుబేరులు ప్రపంచంలోనే కేవలం ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌, మరో శ్రీమంతుడు అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌. ఈ సంవత్సరం గేట్స్‌ సంపద 100బిలియన్‌ డాలర్లు దాటినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్ తాజాగా ప్రకటించింది. జెఫ్‌ బెజోస్‌ సంపద 145.6బిలియన్‌ డాలర్లు. ఈ ఒక్క ఏడాదే బెజోస్‌ సంపద 20.7 బిలియన్‌ డాలర్లు పెరగగా.. గేట్స్‌ ఆస్తులు 9.5 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. కాగా.. బిల్‌గేట్స్‌ 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటడం ఇదే తొలిసారి కాదు. 1999లో గేట్స్‌ ఆస్తిపాస్తులు 100 బిలియన్‌ డాలర్లను దాటాయి. అయితే ఆ తర్వాత తన సంపదలో కొంత గేట్స్‌ ఫౌండేషన్‌కు ఇవ్వడంతో ఆయన నెట్‌వర్త్‌ తగ్గింది. గేట్స్ తర్వాత ఈ ఘనత సాధించిన మరో వ్యక్తి బెజోస్‌.