ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్స్....

SMTV Desk 2019-03-21 11:49:05  sbi, sbi interest schemes, deposit, fixid deposit

ముంబై, మార్చ్ 19: స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఒక్కో డిపాజిట్‌ స్కీమ్ కు ఒక్కోలా వడ్డీ రేట్లు ఉంటాయి. ఎందులో ఇన్వెస్ట్‌ చేసినా రిస్క్‌ ఉండదు. రిటర్నులు తక్కువైనా మీ డబ్బుకు మాత్రం భరోసా ఉంటుంది. మరి ఏ పథకం మీకు బెస్ట్‌ ఆప్షనో తెలుసుకోండి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఫథకంలో మీరు ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు రూ.2కోట్ల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5.75నుంచి 6.85శాతం వడ్డీ లభిస్తుంది. వృద్ధులకు 6.25శాతం నుంచి 7.35శాతం వడ్డీ లభిస్తుంది. రికరింగ్‌ డిపాజిట్‌ అంటే నెలు కొంత పొదుపు చేయాలనుకునే వారికి రికరింగ్‌ డిపాజిట్‌ సరైన ఆప్షన్‌. వడ్డీ కూడా లభిస్తుంది. మీరు నెలకు కనీసం రూ.100పొదుపు చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్‌ చేయొచ్చు. ఏడాది నుంచి 120 నెలల వరకు ఆర్‌డిలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌కు వచ్చే వడ్డీనే రికరింగ్‌ డిపాజిట్‌కు లభిస్తుంది. నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ అంటే 18 నుంచి 65ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు ఎవరైనా నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయొచ్చు. రిటర్నులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్‌ పిపిఎఫ్‌. ఏడాదికి రూ.500నుంచి రూ.1,50,000వరకు ఎస్‌బిఐ పిపిఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు దాచుకోవచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. లేదా నెలనెలా పొదుపు చేయొచ్చు. ప్రస్తుతం వడ్డీ 8.0శాతం ఉంది. వడ్డీరేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ అంటే వృద్ధులు రిటైర్మెంట్‌ తర్వాత వచ్చిన డబ్బుల్ని దాచుకోవడానికి ఉపయోగపడే అకౌంట్‌ ఇది. రూ.1,000నుంచి రూ.15లక్షల వరకు ఎంతైనా దాచుకోవచ్చు.