వారి అండ చూసుకొని జగన్ రెచ్చిపోతున్నారు...

SMTV Desk 2019-03-07 12:32:06  Chandrababu Naidu, Jaganmohan Reddy, Chandrasekhar Rao, Narendra Modi, IT Grid, Data Leakage, TDP, TRS, YCP, BJP

అమరావతి, మార్చి 7: తెలుగు రాష్ట్రాల మధ్య ఐటీగ్రిడ్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీలోని కిందిస్థాయి నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాల్ సెంటర్ నుండి ఫోన్లు రావడం సంచలనం సృష్టిస్తుంది. ఈ విషయం పట్ల స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ పై తీవ్రగా మండ్డిపడరు. జగన్... ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అండ చూసుకొని రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. తమ నెంబర్లు ఎవరిచ్చారంటూ నిలదీయాలని పార్టీ నాయకులకు బాబు పిలుపునిచ్చారు.

ఈ ఉదయం పార్టీ నేతలతో టెలికాన్పరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు, తొలి దశలో రాష్ట్రంలో 13 లక్షల ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్రలు పన్నిందని ఆరోపించారు. కాగా ఈ కుట్రపై తొందరగా స్పందించడం వల్ల జగన్ వ్యూహం అమలు కాలేదని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏ విధంగా ఓట్లను తొలగించిందో అదే తరహాలో ఏపీలో కూడా తొలగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. గతంలో కూడా రాష్ట్రంలోని 59 లక్షల ఓట్లను తొలగింపు కుట్రకు జగన్ సూత్రధారి అంటూ విమర్శించారు. జగన్‌ మాయా రాజకీయం ఏపీలో చెల్లదన్నారు. హైదరాబాద్‌లో తమపై కేసులు పెట్టిస్తున్నారని, తమ డేటా దొంగిలించి ఓట్లు వేయాలని తమకే ఫోన్లు చేస్తున్నారని తప్పుపట్టారు.